
సిమెంట్ ఫ్యాక్టరీ భూముల సేకరణపై బెదిరిస్తే ఊరుకోం: ఎమ్మెల్సీ
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, మైదుకూరులో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ భూముల సేకరణపై రైతులతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అవగాహన సమావేశం ఆదివారం నిర్వహించారు. భూముల కోసం రైతులను బెదిరిస్తే ఊరుకోమని, న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాల్మియా తరహాలోనే రైతులు నష్టపోకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. స్వలాభం కోసమే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని, ధరలు నిర్ణయించే అధికారం వారికి ఎవరిచ్చారని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు పొన్నపురెడ్డి శివారెడ్డి, వల్లంబాయి రిషికేశ్వర్ రెడ్డి, హనుమంతు రెడ్డి, రైతులు పాల్గొన్నారు.



























