AP: రాజకీయాల్లో కీలక పార్టీ అయిన వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీపై
జనసేన ఎమ్మెల్సీ కొణిదెల
నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ రాజకీయంగా ఎప్పుడో చనిపోయిన పార్టీ అని, ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు తాము ఇంకా బతికే ఉన్నామనే భ్రమలో తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే మరో 15 ఏళ్ల పాటు ఏపీలో కూటమి అధికారంలో కొనసాగుతుందని
నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై
వైసీపీ నేతలు మండిపడుతున్నారు.