AP: రాజకీయాల్లో క్రిమినల్స్ జోక్యం పెరిగిందని,
ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా
వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కూటమి అభ్యర్థులపై
వైసీపీ దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేత బెంగళూరు నుంచి వచ్చి హిట్ అండ్ రన్
రాజకీయాలు చేస్తున్నారని, గతంలో రౌడీలను దగ్గర పెట్టుకోవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు రౌడీలే
రాజకీయాలు నడిపిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో ఇంతటి అరాచకాలను తాను ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.