AP: ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమలు వస్తుంటే,
వైసీపీ రౌడీలను తీసుకొచ్చి పొన్నూరు, రాయచోటి, తిరుపతిలో ఘర్షణలకు పాల్పడుతోందని
టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లేవారిని భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలని కుట్ర పన్నుతోందని విమర్శించారు. పాత ఫ్యాక్షన్ బుద్ధితో శాంతిభద్రతలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.