డీఎస్సీ అభ్యర్థులుగా వైసీపీ జూనియర్ ఆర్టిస్టులు: టీడీపీ

5046చూసినవారు
డీఎస్సీ అభ్యర్థులుగా వైసీపీ జూనియర్ ఆర్టిస్టులు: టీడీపీ
AP: డీఎస్సీ అభ్యర్థులుగా వైసీపీ జూనియర్ ఆర్టిస్టులు ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేస్తున్నారని టీడీపీ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ‘బాబాయి గుండెపోటు డ్రామాను మించి, కోడికత్తి నాటకాన్ని మైమరపించి, గులకరాయి పెర్ఫార్మెన్స్‌ను మర్చిపోయేలా, డీఎస్సీ డ్రామాకు జగన్ రెడ్డి రక్తికట్టించాడు. వైసీపీ జూనియర్ ఆర్టిస్టులను డీఎస్సీ అభ్యర్థులుగా చూపిస్తూ ఆస్కార్-లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఎప్పటిలాగే ఫేక్ దొంగలు దొరికిపోయారు’ అని టీడీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్