AP: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంట గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వార్డు మెంబర్గా నామినేషన్ వేసేందుకు వచ్చిన
టీడీపీ అభ్యర్థి రఘుపతి నాయుడుపై
వైసీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు దాడి చేశారు. ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడు బాధితుడి కుడి చెవిని పళ్లతో కొరికేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేసి చెవిలోని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.