ఓటు కోసం మటన్ ఫ్రీగా పంపిణీ చేసిన వైసీపీ నేత

1చూసినవారు
ఓటు కోసం మటన్ ఫ్రీగా పంపిణీ చేసిన వైసీపీ నేత
AP: ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామంలో బుధవారం ఓటు కోసం మటన్ పంపిణీ చేస్తున్న ఘటన కలకలం రేపింది. స్థానిక వైసీపీ నాయకుడు చిన్నపురెడ్డి రమణారెడ్డి, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం 20 పొట్టేళ్లను సుమారు రూ.6 లక్షలకు కొనుగోలు చేసి, 600 ఇళ్లకు కేజీ చొప్పున పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ బృందం వెంటనే రంగంలోకి దిగి పంపిణీని అడ్డుకున్నారు. రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న పొట్టేళ్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్