AP: రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కడప జిల్లా వేంపల్లిలో సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని గత రెండు రోజులుగా కలెక్టర్ మరియు ఎస్పీలను సతీష్ రెడ్డి కోరినప్పటికీ, ఈ అరెస్ట్ చోటుచేసుకోవడం గమనార్హం. స్థానిక ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.