AP: వైయస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం, ఎర్రగుంట్లలో
వైసీపీ నేత తుంగా వెంకటరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి, ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం, ఆయనను ఎర్రగుంట్ల నుంచి ముద్దనూరు వైపు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్టుకు గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.