AP:
ఎన్టీఆర్ జిల్లాలో
టీడీపీ కార్యకర్తపై
వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇటీవల కొండూరు గ్రామానికి చెందిన
వైసీపీ నేతల ఇంట్లో అక్రమ మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మద్యం పట్టించారనే కక్షతో
టీడీపీ కార్యకర్త జొన్నలగడ్డ నాగార్జునపై
వైసీపీ నేతలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నాగార్జునను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.