బ్యాలెట్ బాక్సును బద్దలుకొట్టిన వైసీపీ నాయకులు

1301చూసినవారు
బ్యాలెట్ బాక్సును బద్దలుకొట్టిన వైసీపీ నాయకులు
AP: అనంతపురం జిల్లా, కూడేరు మండలం మరుట్లలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరుట్లలోని రెండో కాలనీ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నాయకులు బ్యాలెట్ బాక్సును బలవంతంగా బయటకు విసిరివేసి, రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా వైసీపీ నేతలు దాడికి పాల్పడటంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలింగ్ ప్రక్రియను అడ్డుకుంటూ ఎన్నికల కేంద్రం వద్ద వారు చేసిన ఈ దాడి ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

సంబంధిత పోస్ట్