స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ

50చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ
AP: పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ అనే మూడు మండలాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బుక్కపట్నం ఎంపీపీగా పల్లగోర్ల నాగమణి, కొత్తచెరువు ఎంపీపీగా మహాలక్ష్మి, నల్లమాడ ఎంపీపీగా శ్రీశైలం నవ్య శ్రీ ఎన్నికయ్యారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ విజయంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్