AP: తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 84 గ్రామ పంచాయతీలకు గాను,
వైసీపీ 39 స్థానాలను కైవసం చేసుకుని అత్యధిక స్థానాలతో విజయదుందుభి మోగించింది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన
టీడీపీ కేవలం 34 పంచాయతీలకే పరిమితమైంది. దీంతో గన్నవరం
వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.