AP: కడప జిల్లా, కొండాపురం మండలం, కొట్టాలపల్లె గ్రామానికి చెందిన తోడికోడళ్లు ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీడీపీ నేత అరుణ్కుమార్రెడ్డి భార్య జ్యోత్స్న రేగడిపల్లె ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికవ్వగా, ఆయన తమ్ముడు హరిచంద్రారెడ్డి భార్య బేబిరాణి కొట్టాలపల్లె సర్పంచిగా ఎన్నికయ్యారు. జ్యోత్స్న గతంలో 2013-18 వరకు సర్పంచిగా పనిచేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు కోడళ్లు పదవులు దక్కించుకోవడం విశేషం.