ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


స్కైరూట్‌తో అమెరికా సంస్థ ఒప్పందం.. రాత్రిపూట సూర్యకాంతి ప్రయోగం
Oct 17, 2026, 17:10 IST/

స్కైరూట్‌తో అమెరికా సంస్థ ఒప్పందం.. రాత్రిపూట సూర్యకాంతి ప్రయోగం

Oct 17, 2026, 17:10 IST
అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ సంస్థ, భారత స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో అంతరిక్షం నుంచి రాత్రి వేళల్లో భూమిపైకి సూర్యరశ్మిని పంపే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రయోగాలను స్కైరూట్‌ విక్రమ్‌-1 రాకెట్ ద్వారా చేపట్టనున్నారు. ఈ అద్దాల సాంకేతికతతో విపత్తు సమయాల్లో సహాయక చర్యలు చేపట్టడం, రాత్రిపూట సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ కృత్రిమ వెలుతురు వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.