
మరింత పెరగనున్న ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీల ధరలు?
ఈ నెల 1వ తేదీ నుంచి ఏసీలు, రిప్రిజిరేటర్లు, టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్లో విక్రయాల్లో 15-35 శాతం వృద్ధి నమోదు చేస్తాయని ఆయా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఆఫర్లు, రీప్లేస్మెంట్, ఈఎంఐ ఆప్షన్లు డిమాండ్ను పెంచుతాయని పేర్కొంటున్నాయి. డిష్ వాషర్స్, మైక్రోవేవ్ ఒవెన్స్ కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.































