
16 ఏళ్ల బాలికపై సొంత అన్న లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు
TG: ఆదిలాబాద్ పట్టణంలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఆమె సొంత అన్న గత 15 రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. నిందితుడు ఆమెను చంపేస్తానని బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. వేధింపులు భరించలేక సోమవారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.




