
గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళలు గల్లంతు
AP: శ్రీ సత్యసాయి జిల్లాలోని గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన వారు జలాశయంలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మహిళల బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, వివరాలు సేకరిస్తున్నారు.





















