ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Oct 06, 2026, 14:10 IST/

DRDO సరికొత్త చరిత్ర.. హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్ టెస్ట్ సక్సెస్

Oct 06, 2026, 14:10 IST
DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ (HAPS) ప్రయోగాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎయిర్‌షిప్‌ 21 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని, సుమారు 20 కిలోమీటర్ల ఎత్తులో 30 నిమిషాలకు పైగా స్థిరంగా ప్రయాణించింది. రియల్‌టైమ్‌ వీడియో, వాహన పనితీరు డేటా గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌కు చేరింది. ఆగ్రాలోని డీఆర్‌డీఓ అనుబంధ ఏడీఆర్‌డీఈ ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. నిఘా, కమ్యూనికేషన్స్‌ అవసరాలకు ఇది ఉపయోగపడనుంది. విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శాస్త్రవేత్తలను అభినందించారు.