
నవంబర్ 13న ఆశిష్ గాంధీ 'డానీ' విడుదల
యువ హీరో ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్జీ గోగణ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'డానీ'. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్జీ కంటెంట్ పిక్చర్స్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా రొమాంటిక్, క్రైమ్, రా అండ్ రస్టిక్ జోనర్లో తెరకెక్కింది. మనిషి జీవితంలో అలవాట్లు, ప్రేమ మధ్య సంఘర్షణ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్. ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా హీరోయిన్గా నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




























