
ఈనెల 28 నుంచి 3 రోజులపాటు బ్యాంకులు బంద్
తమ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మూడు రోజుల సమ్మె తర్వాత కూడా తమ డిమాండ్లు నెరవేరకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. సమ్మె సమయంలో బ్రాంచ్ సేవలు నిలిచిపోయినప్పటికీ.. UPI, ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది.




