
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకున్నారు. టెస్టులు, వన్డేలు, టీ20.. మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు. సుదీర్ఘకాలం కెప్టెన్‌గా సేవలందించిన హర్మన్‌ప్రీత్ నిర్ణయంతో భారత జట్టు తదుపరి సారథి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.




