
ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి (వీడియో)
ఇరాన్లోని కుర్దెస్తాన్, హమేదాన్ ప్రావిన్స్లను కలిపే రహదారిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అది ముందున్న వాహనాలను ఢీకొని పేలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది.




