
ఒంట్లో కరుప్ప స్వామి ఉన్నాడని.. నగ్నంగా తిరుగుతున్న దంపతులు
తమ ఒంట్లో కరుప్ప స్వామి ఉన్నాడని చెబుతూ దంపతులు గత కొద్దిరోజులుగా నగ్నంగా ఊరిలో తిరుగుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరులో చోటుచేసుకుంది. పళని(56), దీప(48) అనే దంపతులు కొన్ని రోజులుగా ఇంట్లో వింత పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమలో కురప్ప స్వామి ఉన్నాడని దంపతులు నాలుగు రోజులుగా ఊరిలో నగ్నంగా తిరుగుతున్నారు. తమను వ్యతిరేకిస్తే సర్వనాశనం అయిపోతారని బెదిరిస్తున్నారు. దాంతో ప్రజలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.




