ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పెళ్లి వివాదం.. ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
Sep 22, 2026, 02:09 IST/

పెళ్లి వివాదం.. ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

Sep 22, 2026, 02:09 IST
TG: హైదరాబాద్ మూసారాంబాగ్‌లో కానిస్టేబుల్ ముథే చంద్రశేఖర్ (35) ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేసుకోబోయే యువతిని మరో యువకుడు ప్రేమిస్తున్నానని అతడిని వేధించడంతో, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా యువతితో చంద్రశేఖర్ మాట్లాడుతున్నాడు. 'నిన్నే పెళ్లి చేసుకుంటా' అని ఆ యువతి చెప్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సదరు యువతికి వీడియో కాల్ చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. యువతి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకునేలోపే మృతి చెందాడు.