
అమెజాన్ బెస్ట్ బ్రాండ్లకు అవార్డులు: శామ్సంగ్, సోనీ, ఆసుస్‌కు గుర్తింపు
అమెజాన్ 'బెస్ట్ ఇన్ టెక్' అవార్డుల రెండో జాబితా విడుదలైంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్ విభాగాల్లో అత్యుత్తమ బ్రాండ్లకు ఈ గౌరవం దక్కింది. 'స్మార్ట్‌ఫోన్ ఆఫ్ ది ఇయర్'గా శామ్సంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా, మోస్ట్ ట్రస్టెడ్ టీవీగా సోనీ బ్రావియా, ఉత్తమ ల్యాప్‌టాప్‌గా ఆసుస్ జెన్‌బుక్ నిలిచాయి. వన్‌ప్లస్ ప్యాడ్‌కు బెస్ట్ టాబ్లెట్ అవార్డు లభించింది. హోమ్ అప్లయన్సెస్ విభాగంలో బాష్, హాయర్, డైకిన్ అవార్డులు గెలుచుకున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని అమెజాన్ ప్రకటించింది.




