
RRB ఉద్యోగాలు.. పరీక్షల షెడ్యూల్ విడుదల
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) NTPC-2026 పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. డిసెంబర్ నాలుగో వారంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. CBT-2 పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,548, అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో 1,688 ఖాళీలతో సహా మొత్తం 5,236 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వివరాల కోసం https://www.rrbapply.gov.in/ ను సందర్శించవచ్చు.































