ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పశ్చిమ బెంగాల్‌లో భార్య తల నరికి వీధుల్లో తిరిగిన భర్త
Nov 04, 2026, 09:11 IST/

పశ్చిమ బెంగాల్‌లో భార్య తల నరికి వీధుల్లో తిరిగిన భర్త

Nov 04, 2026, 09:11 IST
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్‌లో బుధవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. రింటూ ఘోష్ అనే వ్యక్తి తన భార్య సీమా సర్కార్ ఘోష్‌ను పదునైన ఆయుధంతో హత్య చేశాడు. అత్యంత కిరాతకంగా ఆమె తలను నరికి, ఆ తెగిన తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం సమీపంలోని ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.