ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Sep 19, 2026, 05:09 IST/

కాజీపేటలో రూ.1.38 కోట్ల పాత కరెన్సీ.. 8 మంది అరెస్ట్ (వీడియో)

Sep 19, 2026, 05:09 IST
TG: కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం రద్దు చేసిన రూ.1.38 కోట్ల విలువైన పాత కరెన్సీని రవాణా చేస్తున్న ముఠాను కాజీపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి కాజీపేట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని సోదా చేయగా, 2016లో రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్ల కట్టలు బయటపడ్డాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి నోట్ల సరఫరాకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఆ వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు.