
3,477 ఉద్యోగాలకు RRB షార్ట్ నోటీసు విడుదల
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) NTPC గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి 3,477 తాత్కాలిక ఖాళీలతో కూడిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 7న పూర్తి స్థాయి నోటిఫికేషన్ రానుంది, అక్టోబర్ 8 నుండి దరఖాస్తులు ప్రారంభమై నవంబర్ 6 వరకు కొనసాగనున్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్- 2,750, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-371, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపెస్ట్-300, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్-56 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తైన వారు అర్హులు.




