
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బియ్యం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. సన్న రకం బియ్యం కిలో రూ.85-90కి చేరగా, 25 కిలోల బస్తా ధర రూ.300-500 పెరిగింది. గత నెలలో రూ.1,800 ఉన్న బస్తా ధర ఇప్పుడు రూ.2,000 దాటింది. వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వల్ల రాబోయే పంట దిగుబడిపై ఆందోళన నెలకొంది. ఈ ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజల ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని, ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.






























