
ప్రియురాలితో పట్టుబడి భార్యపైకి కారు ఎక్కించిన భర్త (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో శనివారం రాత్రి, మయాంక్ సింగ్ అనే వ్యక్తి తన ప్రియురాలితో కారులో తిరుగుతూ భార్య సునీతకు దొరికిపోయాడు. భార్య కారు విండోస్ కొట్టడంతో భయాందోళనకు గురైన మయాంక్ కారును పోనిస్తుండగా ఆమె అడ్డుగా నిలబడింది. దీంతో అతడు కారు ఆపకపోవడంతో ఆమె బోనెట్పై వేలాడగా, అలాగే 100 మీటర్లు వేగంగా నడిపాడు. స్థానికులు కారును అడ్డుకుని మహిళను రక్షించగా, లోహియానగర్ పోలీసులు భర్త మయాంక్, అతడి ప్రియురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.




