
భర్తను గొడ్డలితో నరికిచంపిన భార్య
TG: సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. మచ్చబొల్లారం గోపాల్ నగర్లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో శ్రీనివాస్, రమాదేవి దంపతులు నివాసముంటున్నారు. శ్రీనివాస్ వ్యాపారంలో నష్టపోవడంతో దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా గొడవ జరగడంతో ఆవేశంలో భార్య రమాదేవి భర్త శ్రీనివాస్పై గొడ్డలితో దాడి చేసింది. తీవ్ర గాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు.




