
తల్లిదండ్రుల కళ్లెదుటే గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
TG: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదువుతున్న రాఘవ (19) దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. ఉదయం తండ్రితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని వైరాలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రాఘవ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చిన్న వయసులోనే గుండెపోటుతో కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం అయింది.




