వెల్లింగ్టన్ వేదికగా
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(2), డారిల్ మిచెల్(10) ఉన్నారు. భారత బౌలర్లు అకీబ్ నబి 2, అన్షుల్ కంబోజ్ ఒక వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు.