సూడాన్‌లోని రెడ్ సీ రాష్ట్రంలో ఆదివారం బంగారు గని షాఫ్ట్ కూలిన ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానించడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన ఈశాన్య సూడాన్‌లోని మారుమూల ఓని ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇటీవల పశ్చిమ సూడాన్‌లో గని కూలిన ఘటనలో కనీసం 82 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.