TG: అర్నబ్ తుఫాన్ వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే 12 విమానాలు రద్దు చేశారు. శంషాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖ వెళ్లాల్సిన విమానాలు నిలిపివేశారు. వర్షాలు, గాలుల దృష్ట్యా ముందుజాగ్రత్తగా అధికారులు చర్యలు చేపట్టారు. వాతావరణ పరిస్థితుల మేరకు తదుపరి సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. పలు రైళ్లను కూడా రద్దు చేశారు.