TG: రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో సీనియర్ అధికారి జయేశ్ రంజన్‌ను మెట్రోపాలిటన్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం నుంచి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్, టెక్నాలజీ శాఖల చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా వికాస్ రాజ్ విద్యుత్ శాఖ సీఎస్‌గా నియమితులయ్యారు.