
వరకట్నం వేధింపులు.. రూ.50 వేలు తెస్తేనే టాయిలెట్ వాడాలంటూ తాళం!
ఉత్తరప్రదేశ్ భదోహిలోని రోషన్తారాలో అత్తింటివారి వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగుచూసింది. రూ.50 వేల కట్నం డిమాండ్ చేస్తూ షబ్నమ్ (20) అనే కొత్త కోడలికి టాయిలెట్ వాడకుండా అత్తింటివారు తాళం వేశారు. సెప్టెంబరు 27న బాధితురాలు బాత్రూమ్ డోర్ తీసేందుకు ప్రయత్నించగా మామ, ఇతర కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె పొరుగింటి వారి టాయిలెట్ వాడాల్సి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కుటుంబసభ్యులపై బిఎన్ఎస్, వరకట్న నిషేధ చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.




