21వేల పానీ పూరిల‌తో 13 అడుగుల ఎత్తైన గ‌ణేశుడు

50చూసినవారు
దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో గణేష్ ఉత్సవాల సందర్భంగా, ఎఫ్‌సీ రోడ్డులోని గణేష్ బేల్ షాపు యజమానులు 13 అడుగుల ఎత్తులో సుమారు 21,000 పానీపూరీలతో భారీ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. రూపేష్, దినేష్ గుడ్మేవర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఇది పర్యావరణ హితంగా నిర్మించబడింది. గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత, ఈ పానీపూరీలను నీటిలో నిమజ్జనం చేయడానికి బదులుగా సేంద్రీయ ఎరువుగా మార్చనున్నారు.

సంబంధిత పోస్ట్