AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తులు వెలుపల ఉన్న శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని మొత్తం 83,670 మంది భక్తులు దర్శించుకోగా, 35,785 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.