ఆసియా పారా క్రీడలలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో మెరుస్తున్నారు. మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో స్ప్రింటర్ సిమ్రాన్ స్వర్ణ పతకాన్ని సాధించగా, ఇదే పోటీలో తేజల్బెన్ దామోర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే, పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్లో ప్రణవ్ సూర్మ స్వర్ణ పతకాన్ని, రామ్ రతన్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయాలతో
భారత్ సాధించిన మొత్తం స్వర్ణ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. భారత అథ్లెట్ల వరుస విజయాలు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి.