22 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం

4చూసినవారు
22 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది బెంగళూరు నుంచి యాదగిరి చేరుకున్న 22 ఏళ్ల యువతిపై రైల్వే పోలీసులతో సహా ఆరుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బెదిరించి, వివిధ ప్రాంతాలకు, లాడ్జిలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బస్సులో రోధిస్తున్న బాధితురాలిని చూసి తోటి ప్రయాణికుడు '112' హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన యాదగిరి పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్