
సిగరెట్ ఇవ్వలేదని షాపు యజమాని కుటుంబంపై దాడి (వీడియో)
AP: అన్నమయ్య జిల్లా రామసముద్రం దిగువపేటలోని తాజ్ హోటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుకాణం మూసివేసినందున సిగరెట్లు ఇవ్వలేదని ఆగ్రహించిన కొందరు యువకులు, షాపు యజమాని కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. గేట్లను కాలితో తన్నిన నిందితులు, యజమాని కుటుంబ సభ్యులను దుర్భాషలాడారని, అంతేకాకుండా మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు.




