అల్వాల్‌ టిమ్స్‌కు కొత్తగా 339 పోస్టులు

19చూసినవారు
అల్వాల్‌ టిమ్స్‌కు కొత్తగా 339 పోస్టులు
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం 339 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్‌ శుక్రవారం జీవో జారీ చేశారు. ఈ పోస్టులను ఎయిమ్స్‌ వేతనాల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వీటిలో డైరెక్టర్‌, ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లు, ఇంజనీరింగ్‌ సిబ్బందితో పాటు వివిధ అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులున్నాయి. డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభించే ముందు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్