
AP: నేటి నుంచి రైతు బజార్లలో రూ.35కే కిలో ఉల్లి
AP: రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35లకే విక్రయించేందుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్య చేపట్టారు. మహారాష్ట్రలోని నాసిక్ నుండి రైల్వే వ్యాగన్ల ద్వారా దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాష్ట్రానికి తరలించారు. ఈ తక్కువ ధర ఉల్లి విక్రయాలు శనివారం నుండే అన్ని రైతు బజార్లలో అందుబాటులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు.




