
ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. ప్రతిభావంతులైన విద్యార్థులకు వరం
ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఓఎన్జీసీ ఫౌండేషన్ 2,000 స్కాలర్షిప్స్ అందిస్తోంది. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థులు అర్హులు. ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు, కుటుంబ ఆదాయ పరిమితి నిబంధనలు వర్తిస్తాయి. ఎంపికైన వారికి నెలకు రూ.4,000 చొప్పున రెండేళ్లు లేదా నాలుగేళ్ల పాటు అందిస్తారు. 50 శాతం స్కాలర్షిప్స్ మహిళలకు కేటాయించారు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30. వెబ్సైట్ https://ongcscholar.org/#/fellowshipScheme




