ఢిల్లీలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

21చూసినవారు
ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సత్య నికేతన్‌లో హాస్టల్‌ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన జరిగిన నెల రోజులకే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

సంబంధిత పోస్ట్