వరుసగా 50 వాహనాలు ఢీ.. 10 మంది మృతి (VIDEO)

8చూసినవారు
ఆగ్నేయ బల్గేరియాలోని ట్రాకియా హైవేపై మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 50 వాహనాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొనడంతో 10 మంది మరణించగా, 27 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర పొగమంచు, తడి రోడ్డు, మితిమీరిన వేగమే ప్రమాదానికి ప్రాథమిక కారణాలని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్