ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై బయటకు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.